Sri Ganesh
Sri Puruhutika Devi
శ్రీ అచ్యుత హస్తం
Sri Atchyuta Hastham
Sri Atchyuta Rao Lingam
Retired B.A, B. Ed Mathematics Teacher, A K P Municipal high school, Pithapuram
A dedicated teacher, family man with high understanding of society and social responsibilities
Srimati Krishna Kumari, B.A.
మిషన్ మరియు విధానం
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః
ఓం శ్రీ పురుహూతికాదేవ్యై నమః
చక్కని వాక్యాలు, తియ్యని పలుకులతో మనిషి ఆకలి,అవసరము తీరడమన్నది అంత సులువు కాదన్నది నా అభిప్రాయము. పైగా తెలుసున్నది ధర్మము కాదు, ఆచరించేదే ధర్మమని గురువులు చెప్పగా విన్నాను.
సమాజానికి ఎదోచేయాలనే అలోచన చాలా సంవంత్సరాలుగా ఉంది , మరియు నడిపిస్తోంది కూడా. ఐతే దానికి ఒక పరిపక్వత తెచ్చి సరి ఐన మార్గములో పెట్టాలని కొంత కాలంగా బాగా తపన పడుతున్నాము.
సంపాదించే దానిలో ఎంతోకొంత మనది కాదని పక్కన పెట్టి దానిని సమాజ శ్రేయస్సు కి వాడాలని మా నాన్న గారు నాకు ఎపుడూ చెప్తుంటారు.
ఈశ్వర కృపతో, మా తల్లిదండ్రుల ఆశీర్వచనములతో, పెద్దల దీవెనలతో, నేడు ఆ కార్యక్రమానికి నాంది పలుకుతున్నామని చెప్పటానికి ఎంతో సంతోషిస్తున్నాము.
” శ్రీ అచ్యుత హస్తం ” (మా నాన్న గారి పేరు శ్రీ అచ్యుత రావు ) ద్వారా, నా ధర్మ సంపాదన నుంచి 15 లక్షల రూపాయలు బ్యాంక్ లో ఫిక్స్ చేసి , “అసలు” ని ఎప్పటికీ వాడకుండా, దానిపై వచ్చే వడ్డీని, అవసరమైన తోటి వారికి సాయము చేయాలని నిశ్చయించినాము. మరీ ముఖ్యంగా దీనావస్థన యున్నగుడికి, వేదం చదువుకుని ఇల్లు గడవని వారికి, తోడులేని వృద్దులకు, వైద్య ఖర్చులకు, పేద విద్యార్థుల ఫీజుకు, మా వూరికి (పిఠాపురము) , పేద పిల్లల కళ్యాణానికి , అన్నదానమునకు, కష్టములో యున్న రైతుకు , వేరే ఏదైన అనుకోని లేద/మరియు అవసరమైన పనికి ఈ మొత్తాన్ని నెలకు ఒక కార్యానికి కొంత చొప్పున సవంత్సరమంతా వాడాలన్నది మా ఆలోచన. కులము, మతము వీటికి అడ్డురాకూడదన్నది మా నిశ్చల అభిప్రాయము.
ఇది సమాజ పరంగా పెద్ద మొత్తము కాకపోయినా, నాకు వ్యక్తిగతంగా పెద్ద మొత్తము మరియు చక్కని ఆత్మ తృప్తిని ఇచ్చే కార్యము. కావున, మీ అందరూ నన్ను ఆశీర్వదించి, ప్రోత్సహించి దీనిని నిర్విఘ్నంగా నేను మరింత ముందుకు తీసుకొని వెళ్ళే ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటునాను.
మేము ఏ రకమైన విరాళాలనూ మరియు ఏ విధమైన ఆదాయ పన్ను లాభాన్ని కూడా ఆశించటంలేని కారణంగా , ఈ మా “శ్రీ అచ్యుత హస్తం” ను ఒక సొసైటీ గా గాని, ట్రస్టు గా గాని రిజిష్టర్ చేయ దలుచుకోలేదు.
ఇక్కడ ఒక ముఖ్య విషయము చెప్పదలచుకున్నాను. కొంత మంది, మాకు సంపాదన మరియు మిగులు మితిమీరి ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి పూనుకున్నాననుకోవచ్చు. కానీ అది సత్య దూరము. ఇప్పటికి, నా చదువు, మా పిల్లల చదువులు , వారి వివాహాది కార్యక్రమాలు, తీసుకున్న అప్పులు ఇంకా అలానే ఉన్నాయి. ఐనా ఒక నిబద్దతతో ముందుకు తీసుకెళ్ళాలని నిశ్చయించాము. ఈ తాపత్రయాన్ని అర్థంచేసుకొని , దానికి అనుగుణం గా మమ్ము సంప్రదించగలరన్న ఉద్దేశ్వంతో ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాను.
ఈశ్వర సేవ గా, అవసరమున్న హస్తాలను అందుకొని ముందుకు సాగుతూ ఆనందించాలని , అలాగే ఆపన్న హస్తం కోసం ఎదురుచూడని సమాజము రావాలన్న ఆశతో.
శ్రీనివాస్ లింగం & దీప లింగం
Mission and approach
Jai Sree Ganesh.
Jai Sree PuruhootiKaa.
I believe that it is not easy to fill one’s hunger and needs with only ‘good words. I always hear from Gurus that knowing is not “Dharma”, rather following is “Dharma”.
There has always been a wish to do something for the society. While I’ve already been implementing it for a few years, I felt the need for the process to be channelized by bringing a maturity level.
My father always says that we should keep a portion of our righteously earned money for the society.
By God’s grace, parents’ blessings, we are happy to announce that we are initiating this program.
Thru, ‘Sree Atchyuta Hastham’ (my father’s name is Sri Athyuta Rao ), I am going to keep 15 lac INR in fixed deposit and use the interest on this amount for the society without distributing the principal amount.
We are aware that this fund (of 15 lacs INR) is not a big amount when we see the society and its needs, but for me as an individual, this amount is really large. Therefore, I request all of you to bless us to take this forward with more strength and courage.
We do not want to register this ‘Sri Atchyuta Hastham” as a society or trust as we are not expecting any kind of donations and/ or any kind of tax relief.
Here, I would like to mention a crucial point. Few may believe that we have started this program because our earnings and savings are extensive but that is not true. Mine and my children’s education, their weddings, outstanding house loans are some of our liabilities. The only reason why I mentioned this is in the hope that after knowing, this people will request help with utmost sincerity.
Considering it as ‘Eeswara Seva’, looking forward to feeling good by reaching those who are really in need of help and wishing to see a self-sustaining world where people do not need to ask any help to fulfil their daily needs.
With much respect,
Srinivas Lingam
Deepa Lingam
Sri Atchyuta Hastham Theme Song
శ్రీ అచ్యుత హస్తం..
ఇది అమృత హస్తం..
శ్రీ అచ్యుత హస్తం..
ఇది అమృత హస్తం..
శ్రీ పురుహూతికా దేవి దయతో
శ్రీ విఘ్నేశుని దీవెనలతో వెలసిన హస్తం
శ్రీ అచ్యుత హస్తం ..ఇది మన అమృత హస్తం..
తల్లిదండ్రుల పలుకులను కలగా మిగల్చక
ఇతిహాస సారమును మనమున నిల్పి
సాగు ప్రయత్నము.. ముందుకు సాగు ప్రయత్నం…
శ్రీ అచ్యుత హస్తం..
ఇది అమృత హస్తం..
ఉన్నంతలో కొంత దాచి
ఈశుని సేవగ పదిమందికి తోడు నిల్చు యత్నం
కాలము మారిన , ఇహమున మా వాంఛలు మారిన
తరములు మారిన.. ఇది ఇటులే సాగునని తలచు ప్రయత్నం..
శ్రీ అచ్యుత హస్తం..
ఇది అమృత హస్తం..
పెద్దలార .. గురువులార..
ధైర్యంబు నింపి దీవింపుడు మీ భవదీయులను
శ్రీ అచ్యుత హస్తం..
ఇది అమృత హస్తం..
శ్రీ అచ్యుత హస్తం..
ఇది అమృత హస్తం..
Sri Atchyuta hastham
Amrita hastham
Sri Atchyuta hastham
Amrita hastham
This is being splendid with the grace of Sri Puruhootikaa dEvi and
blessings of Sri Ganesh.
Sri Atchyuta hastham
Amrita hastham
Trying to move forward with Sri Atchyuta hastham
by not letting down the parent’s teachings as a mere dream and
also by keeping the gist of lithaasaas in mind and thought.
Sri Atchyuta hastham
Amrita hastham
While considering this as our sEva to God,
Trying to be associating and stand with the needy ones
by savings some amount from what we have.
Let time change, let our desire change, and
let generations change, still we wish that this will continue as it is.
Sri Atchyuta hastham
Amrita hastham
Elders and Gurus may pour in
their blessings by filling in with enough strength
Sri Atchyuta hastham
Amrita hastham
Sri Atchyuta hastham
Amrita hastham
Updates and Activities
Sr No. | Date | Activity | Donation | Person Received |
1 | 12Feb22 | Gosaala (గోశాల) | 1116 INR | VedapaaTaSaala (వేదపాఠశాల) |
2 | 11Mar22 | Tickets for a Kasi trip to a Shiva devotee couple (శివ భక్త దంపతులకు కాశీ యాత్ర టిక్కెట్టు) | 5000 INR | Pithapuram |
3 | 30Mar22 | శ్రీరామాలయం జీర్ణోద్దరణ (Temple repairs) | 5116 INR | Shakkarnagar-Bodhan (శక్కర్నగర్ బోధన్) |
4 | 04Apr22 | Medical help (kidney dialysis) | 2000 INR | Vanum Manikanta |
5 | 07Jun22 | helping an Artist in Natyam (కళాకారునికి సహాయము) | 2500 INR | sri Pilla Satyanaaraayana (శ్రీ పిల్లా సత్యనారాయణ గారు భరతనాట్య గురువులు) |
6 | 11Aug22 | Annasamtarpana (మాహేశ్వర పూజ గా అన్నసంతర్పణ) | 15000 INR | Gopal baba aasram pithapuram (గోపాల్ బాబా ఆశ్రమము) |
7 | 05Oct22 | Gosaala (గోశాల) | 1116 INR | vedapaaTaSaala, Tenali వేదపాఠశాల, తెనాలి |
8 | 05Oct22 | school fees for his elder son | 2116 INR | Sri T Suresh |
9 | 18Oct22 | Medical aid for an Eye injection-Central Retinal Vein Occlusion Macular Edema (కంటి చికిత్స నిమిత్తం) | 5000 INR | Sri Ananth Gudimella |
10 | 04Nov22 | Education (school fees for a 10th class boy who lost his father during Covid), | 10000 INR | Upputuri Chintu (Mother- U. Latha) |
11 | 26Nov22 | Education (MBBS fees) | 5000 INR | Mrs. Jagadeeswari's daughter (Varshita) MBBS fees |
12 | 09Jan2023 | Daily groceries needs ( for 3 months) | 5000 INR | Smt Arigela Saraswathi W/O Late Sri Arigela Satyanarayana |
13 | 16Mar23 | Mike set for Sri Raamaalayam (fakurudhhin Palem) | 17276 INR | Fakuruddhin Palem (Setty balji sangham) |
14 | 17Apr23 | Final Rites | 5000 INR | To the family of Later Sri Ramoju Appalaraju via Sri buchhi KRishnam raju |
15 | 07Jul23 | Tution Fees | 11400 INR | 1 term tution fees paid to Ms. Ketineedi Aparna d/o sri venkat rao |
16 | 29Nov23 | wedding help | 5116 INR | Sri Kurada Vijayabhaskar |
17 | 23Dec23 | 10th class guide to 40 students | 3000 INR | pithapuram |
18 | 18Feb24 | Accident case | 5000 INR | patruDu viZag |
19 | 9MAy2024 | Orphan school | 5000 INR | Smt Sunita |
20 | 23MAy24 | Gorcerries | 4500 INR | Pithapuram, physically challenged kirana for 2 months person |
21 | 10Jul24 | MBBS first year exam fees | 17000 | Chy C. Ramya |
22 | 29JUl24 | Sewing machine for a Lady | 6000 INR | Smt Yadigiri Bhavani |
23 | 07Aug24 | Farmer-help for Fertilizer | 2500 INR | Sri Bandaru Appalaraju |
Send Me Your Valuable Comments
Lyrics: Srinivas Lingam
Tune & playback : Dr. Venugopal Rajupalem
Srinivas Lingam