First Anniversary

Feb 1, 2023

Pranaam to All,

Its our responsibility to let Gurus, Friends, Relatives who trusted & blessed us to know what we have been doing last year compared to what we have promised to do.
Exactly a year back on this auspicious day of “Bhishma Ekadashi” (12Feb22), my Telegu padya Guru Sri Kalyan Chakravarthy Tatavarti and my Uncle Sri Col M NV C Rao (veteran) as chief guests, in presence of our relatives, friends the “Sri Atchyutahastham” was inaugurated through my parents, today is the first anniversary of the same.
Though the activities that we have done during past one year are not that big, still we are happy with the progress, however, still wish to do a lot. we keep on posting all those activities that we have been carrying out in our website to reiterate our self-discipline and commitment. Till date, per our plan, never took a single rupee’s donation nor used the interest part for self. This gives us utmost satisfaction.
We strongly believe that God would show us the right path when we do things selflessly.
On this auspicious occasion of first anniversary, we have decided to pay for a MBBS student who is financially weak, without government support and got the seat in an open category (we believe that the fees per year is 50000-70000 Indian rupees, can think about if there is small delta in the fees) for all the 5 years without any bias towards sex, caste, religion & state to which he/she belong to. Therefore, we request all of you to come forward and help us if you have any known ones looking for help in this category.
Last but not the least:
Total initial fixed deposit: 15 lac INR + 5000 INR
Interest earned till date: 86448 INR
Distribution to needy ones as “parameswara seva” – 59064 INR
Balance in the account: 32384 INR

By God’s grace, with our parent’s blessings & family support we try to move forward, we request all of you to encourage us thru your blessings. We would like to thank you all and my friends especially in reaching out to needy ones successfully.

God is great

Regards,
Sri Atchyutahastham

Smt & Sri Deepa & Srinivas Lingam

Visit:
https://sriatchyutahastham.org/

అందరికీ వందనములు

మమ్మునమ్మి ఆశీర్వదించిన గురుబంధుమిత్రజనులకెల్లనిది వివరించుట మా విధియని విశ్వసించి ఇవ్విషయమ్ములనిచట ప్రస్తావించుచుంటిమి.

సరిగ్గా క్రిందటి భీష్మ ఏకాదశి నాడు (12 ఫిబ్రవరి 2022), నా తెలుగు పద్య గురువులు శ్రీ తటవర్తి కళ్యాణ చక్రవర్తి గారు, మా దొడ్డప్ప గారు శ్రీ ఎం. వి. సి. రావు గారు ముఖ్య అతిథులుగా రాగా, అనేక మంది బంధుమిత్రుల సమక్షంలో, మా తల్లిదండ్రుల చేతులమీదుగా శ్రీ అచ్యుతహస్తం ను ప్రారంభించాము. నేటి భీష్మ ఏకాదశి కి (01 ఫిబ్రవరి 2023) శ్రీఅచ్యుతహస్తము ప్రారంభించి ఒక సంవత్సరం పూర్తయింది. అనగా నేడు ఈ సంస్థ ప్రథమ వార్షికోత్సవంబు.

చేసిన కార్యక్రమములు ఆర్థికంగా అంత పెద్దవి కాకపోయినప్పటికినీ , ఈ ప్రథమ సంవత్సరము బహు తృప్తినిచ్చినది , ఐతే పూర్తిసంతృప్తినింకా పొందలేదు, ఇంకా ఏదో చేయాలన్న తపన ప్రజ్వరిల్లుతూనే ఉంది. నిబద్ధత, క్రమశిక్షణ లో భాగంగా, చేసే కార్యక్రమముల వివరములన్నీ ఎప్పటికప్పుడు మా అంతర్జాల వెబ్సైటు లో పొందుపరుస్తున్నాము.

నేటికినీ, మా అలోచన ప్రకారం నడుస్తూ, ఒక్క రూపాయిన్నీ ఎవరివద్దా విరాళముగా స్వీకరించనూలేదు మరియూ వచ్చే వడ్డీలో నొక్క రూపాయినీ మేము స్వంతానికి వాడుకోలేదున్నూ. ఇది మాకు ఎంతో తృప్తినిచ్చే అంశము. చేయు కార్యము స్వార్థరహితమైనప్పుడు ఆ ఈశ్వరుడే సరి ఐన మార్గమును చూపునన్నది మా విశ్వాసము.

ఈ ప్రథమ వార్షికోత్సవ సంధర్భంగా , ఈ సంస్థ ద్వారా, కుల, మత, ప్రాత, లింగ వివక్ష లేకుండా అర్థికంగా వెనుకబడి చదువుకొనలేక , ఏ విధమైన ప్రభుత్వ సహాయమూ అందక, ఓపెన్ కాటగిరీ లో సీటు వచ్చి, ఎం.బి.బి,యెస్ చదువుదామనుకుంటున్న ఒక విద్యార్థి(ని) కి 50-70వేలు సంవత్సరానికి గాను (మాకు తెలిసి ఓపెన్ కాటగిరీ ఫీజు ఇదియని, కాస్త ఇటు అటూ ఐనా కూడా మేము అలోచించగలము) పూర్తిగా 5 సంవత్సరాలకీ ఫీజు కట్టుటకు సిద్దముగా యున్నాము, అందువల్ల మీకు తెలిసిన వారెవరైనా యున్నచో మాకు దెలిపి మమ్ము ప్రొత్సహించ ప్రార్థన.

ఇక చివరిగా లెక్క పద్దూ :-

ఫిక్సిడు డిపోజిట్టు చేసిన అసలు – 15 లక్షల రూపాయలు + 5000 విడిగా వేసినాము
ఇప్పటివరకూ అందిన వడ్డి – 86448 రూపాయలు
పారమేశ్వరసేవగా అందించిన సహాయము – 59064 రూపాయలు
ప్రస్తుతం ఎక్కౌంటు లో యున్న సొమ్ము – 32384 రూపాయలు

దేవుని దయతో, తల్లిదండ్రుల దీవెనలతో, పెద్దల ఆశీర్వచనాబలంతో , కుటుంబ ప్రోత్సాహముతో మరింత ముందుకు వెళ్ళే ప్రయత్నం తప్పకుండా చేస్తాము. మమ్ము ప్రోత్సహిస్తున్న వారందరికీ ధన్యవాదములు.

సర్వే జనాః సుఖినోభవంతు

మీ
శ్రీ అచ్యుతహస్తం
శ్రీమతి & శ్రీ దీప & శ్రీనివాస్ లింగం
శుభకృత సంవత్సర , మాఘ శుద్ద ఏకాదశి . భీష్మ ఏకాదశి
01 ఫిబ్రవరి 2023

Visit:
https://sriatchyutahastham.org/